
వాషింగ్టన్: ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారిస్తూ, ప్రాణ ఆస్తి నష్టం తప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని వైట్ హౌస్ డిమాండ్ చేసింది. ఆ పురస్కారానికి ట్రంప్ అన్నివిధాలా అర్హుడని తేల్చిచెప్పింది. ఈ మేరకు గురువారం వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు సగటున నెలకు ఒక యుద్ధాన్ని ఆపేశాడని చెప్పారు. థాయ్‌లాండ్- కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, రువాండా- డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో (డీఆర్సీ), భారత్- పాక్సెర్బియా-కొసావో, ఈజిప్ట్- ఇథియోపియాల మధ్య ఘర్షణను ట్రంప్ తగ్గించారని చెప్పారు.