ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలి

ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలి

హైదరాబాద్: ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ... పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, మిగతా రాష్ట్రాలకు మరో నీతియా అంటూ విమర్శించారు. పంజాబ్ లో  కేంద్ర ప్రభుత్వం వందశాతం వడ్లు కొనుగోలు చేసిందని, తెలంగాణలో ఎందుకు వడ్లు కొనడంలేదని ప్రశ్నించారు.  ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే వీళ్ళు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందన్నారు.