ఆ రోజు ప్రపంచమంతా కన్నీరు కార్చింది..!

ఆ రోజు ప్రపంచమంతా కన్నీరు కార్చింది..!

అయిదేళ్లయ్యింది ఈ ఫొటో బయటకు వచ్చి. ఆ రోజున ప్రపంచమంతా కన్నీరు కార్చింది.  మధ్యధరా సముద్రపు ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన మూడేళ్ల కుర్దిష్​ బాయ్​ అలన్​ కుర్ది మృతదేహం ఇది. సిరియా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్తున్న కుర్దిష్​లకు చెందిన ఓ కుటుంబంలోని పిల్లవాడు అలన్​. టర్కీ ఫొటో జర్నలిస్టు నిలుఫర్​ డెమిర్​ దీనిని తీశాడు.

ఇన్నేళ్లలో కుర్దిష్​ రిఫ్యూజీల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సిరియా ప్రెసిడెంట్​ బషర్​ అల్​ అసాద్​ని తొలగించాలన్న డిమాండ్​తో సివిల్​ వార్​ ఆరంభమైంది. ప్రభుత్వ బలగాలకు, వేర్వేరు సాయుధ తిరుగుబాటు దళాలకు మధ్య మొదలైన ఈ యుద్ధం ఇప్పడు.. జాతుల పోరాటంగా మారిపోయింది.