హైదరాబాద్,వెలుగు : పోలీసుల్లో స్ఫూర్తి నింపేం దుకు డ్యూటీ మీట్స్, స్పోర్ట్స్ మీట్స్ ఎంతో దోహదపడుతాయని డీజీపీ రవి గుప్తా అన్నారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ తరహాలో రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో ఓవర్ ఆల్ చాంపియన్ షిప్(చార్మినార్ ట్రోఫి)ని గెలుపొందిన పోలీస్ సిబ్బందిని లక్డీకాపూల్‌లోని డీజీపీ ఆఫీసులో బుధవారం విజేతలను సన్మానించి అభినందించారు.
వివిధ కేటగిరీల్లో రాష్ట్ర పోలీసులు గోల్డ్, సిల్వర్ పతకాలతో పాటు ప్రతిష్టాత్మక చార్మినార్ ట్రోఫిని గెలుపొందినది తెలిసిందే. స్పోర్ట్స్ వింగ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర,అడిషనల్ ఐటీ రమణ కుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఐదు బంగారు, ఏడు వెండి పతకాలు, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీలో ఓవర్ ఆల్ విన్నర్స్ ట్రోఫీలను గెలిచిన పోలీసులను అభినందించారు.
