పిల్లలు పుట్టట్లేదని ఆడపడుచు బాబును చంపేసింది

పిల్లలు పుట్టట్లేదని ఆడపడుచు బాబును చంపేసింది

అబ్దుల్లాపూర్ మెట్: పిల్లలు పుట్టకపోవడంతో ఓ మహిళ తన మేనల్లుడ్ని చంపింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. మృతి చెందిన చిన్నారిది రెండు నెలల వయస్సు కావడం గమనార్హం. ఈ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. చిన్నారిది హత్య అని పోలీసులు తేల్చారు. మేనత్త శ్వేత, ఆమె భర్త రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. 

శ్వేత చిన్నారిని చంపి ట్యాంక్‌‌లో పడేయగా.. దానికి ఆమె భర్త రాజు సహకరించాడని పోలీసులు విచారణలో బయటపడింది. తనకు పిల్లలు కాకుండా ఆడపడుచుకి బాబు పుట్టడంతో శ్వేత ద్వేషం పెంచుకుందని పోలీసులు తెలిపారు. శ్వేతకు అబార్షన్ కావడంతో భర్త రాజుతో ఆమెకు రోజూ గొడవ జరిగేదని.. హత్య జరిగిన రాత్రి కూడా వారిద్దరి మధ్య వాదులాట జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో తల్లి పక్కన పడుకున్న బాబును అర్ధరాత్రి ఇంటి పైకి తీసుకెళ్లిన శ్వేత.. చిన్నారిని గొంతు నులిమి చంపి ట్యాంక్‌‌లో పడేసింది. కాగా, శ్వేతను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెను రిమాండ్‌‌కు తరలించారు.