ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం

ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం

మరో పారిశ్రామిక విప్లవం దిశగా ప్రపంచం నడుస్తోందన్నారు ప్రధాని మోడీ. దేశాన్ని వీలైనంత వేగంగా తన సొంత కాళ్లపై దేశం నిలబడేలా చేస్తామన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా.. లక్ష్యాలను అందుకోవడంపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలన్నారు. 2020 అసోచాం ఫౌండేషన్ వీక్.. వర్చువల్ సమ్మిట్ లో వాణిజ్య పరిశ్రమల అధిపతులతో మాట్లాడారు పీఎం. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచానికి నమ్మకముందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న సమయంలో భారత్ కు రికార్డ్ స్థాయిలో ఎఫ్ డీఐలు వచ్చాయన్నారు. పోస్ట్ కరోనా తర్వాత.. దేశాన్ని ప్రధాని సరైన దిశలో నడిపిస్తున్నారని.. పారిశ్రామిక వర్గాలు కేంద్రం చర్యలకు మద్దతిస్తాయన్నారు టాటా ట్రస్టుల చైర్మన్ రతన్ టాటా.