ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం

ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం

దేశంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇక ఉత్తర భారతంలో పరిస్థితి గురించైతే చెప్పక్కర్లేదు. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు చల్లటి గాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఈ చలికే మనం గజగజ వణికిపోతుంటే మరి మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే పరిస్థితి ఏంటి?  ఊహించుకునేందుకే భయంగా ఉంది. కానీ రష్యాలోని ఓ ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో అత్యంత శీతల ప్రాంతంగా పేరుకెక్కింది.

రష్యాలోని యాకుట్స్క్ లో ఏటా శీతాకాలంలోనూ మైనస్ 40  డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయితే ఈ ఏడాది ఏకంగా మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్కడి ప్రజలు చలికి వణికిపోతున్నారు. గతంలో ఇక్కడ టెంపరేచర్ మైనస్ 89.9 డిగ్రీ సెల్సియస్ కు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ సాధారణంగా డిసెంబర్ 1 నుండి ఫిబ్రవరి చివరి వరకు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది.