
కృష్ణా జిల్లా హంసలదీవి సాగర సంగమంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న గుడివాడకు చెందిన సరికే అరవింద్ మంగళవారం సాయంత్రం గల్లంతయ్యాడు. అయితే గల్లంతైనా విషయాన్ని తోటి స్నేహితులు ఎవరికీ చెప్పలేదు. రాత్రి 10గంటల సమయంలో అరవింద్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడి కోసం సముద్రంలో గాలింపు చర్యలు మొదలు పెట్టారు సబ్ మెరైన్ పోలీసులు.