
హైదరాబాద్, వెలుగు: సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల ఓపెనింగ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మంగళవారం నుంచే సినిమాలు నడిపించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి షో పూర్తయిన వెంటనే హాల్‌ను పూర్తిగా శానిటైజ్ చేయాలంది. ప్రేక్షకులు, హాల్ సిబ్బంది మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, కామన్ ఏరియాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలంది. హాల్ లోపల టెంపరేచర్ 23 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. బయటి గాలి లోపలికి, లోపలి గాలి బయటకు వెళ్లేలా చూసుకోవాలని చెప్పింది.