రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చోరీ నగలు రికవరీ

రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చోరీ నగలు రికవరీ
  • సీసీ ఫుటేజ్ ల  ఆధారంగా నిందితుడి గుర్తింపు 

గండిపేట, వెలుగు: రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చోరీ కేసును నార్సింగి పోలీసులు చేధించారు. నిందితుడి వద్ద రూ. కోటి విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌కు తరలించారు. పోలీసులు తెలిపిన  ప్రకారం బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ గంధంగూడ కృష్ణానగర్‌‌‌‌ కాలనీ రోడ్‌‌‌‌ నం. 8లో రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ హరిబాబు ఫ్యామిలీతో ఉంటున్నాడు.

వారం రోజుల కిందట ఫ్యామిలీతో  విజయవాడకు వెళ్లారు. ఇంటి వచ్చి చూడగా చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా గంధంగూడకు చెందిన సి.ప్రవీణ్‌‌‌‌ ను నిందితుడిగా గుర్తించారు.  సోమవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలోని బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు తేల్చారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.