పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం చోరీ జరిగింది. స్థానికంగా నివసిస్తున్న నవీన్ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయానికి వెళ్లగా గుడి తాళాలు, హుండీ పగలగొట్టి కనిపించాయి.
అమ్మవారి సన్నిధిలో పరిశీలించగా రెండు తులాల బంగారు, సుమారు కిలోన్నర వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ మధుకుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాసులు, క్రైం టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోరీ జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
