మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ .. కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఓ మహిళాదొంగ చేతివాటం చూపించింది. ప్రయాణికురాలి బ్యాగును దొంగిలించి గాయబ్ అయింది.
బెల్లంపల్లి నుంచి ఈ మధ్యాహ్నం తిరుపతి తీర్థయాత్రకు బయల్దేరారు రాజేశ్వరి, రాజలింగు దంపతులు. హైదరాబాద్ లో ఉన్న తమ కూతురు ఇంట్లో బంగారం దాచిపెట్టి .. తిరుపతి వెళ్లాలనేది వారి ఆలోచన. అలా… ఓ బ్యాగ్ లో సుమారు 20 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు తీసుకుని వస్తుండగా.. రైల్లో గుర్తుతెలియని మహిళ మాట కలిపింది. ఆ తర్వాత… తమ బ్యాగ్ మాయం చేసింది. షాక్ నుంచి తేరుకున్న దంపతులు.. ఈ దొంగతనంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం దొంగిలించిన మహిళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు రైల్వే పోలీసులు.