ఎలమ్మబండలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

ఎలమ్మబండలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

హైదరాబాద్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి అందినకాడికి దోచుకెళ్లడం దొంగల నైజం. కానీ ఈ దొంగ రూటే సెపరేటు. ఇంటి తాళాలు పగలగొట్టి తాపీగా పాలు వేడి చేసుకుని తాగి, కాసేపు రెస్ట్ తీసుకుని మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలజీ ఎల్లమ్మబండలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండలో నివసించే పద్మ అమ్మగారింట్లో పుట్టిన రోజు వేడుకల కోసమని గుడిమల్కాపురంలోని పుట్టింటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ, ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు వేడిచేసుకుని తాగేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని బీరువాలో దాచిన 6 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.20వేల నగదుతో ఉడాయించారు. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన పద్మకు తాళాలు పగలగొట్టి, ఇంట్లో చిందరవందరగా పడేసి ఉన్న వస్తువులు దర్శనమిచ్చాయి. దీంతో తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఆమె జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ సైదులు దర్యాప్తు చేస్తున్నారు.