శంకర్ మఠ్ లో దొంగలు.. నగలు మాయం

శంకర్ మఠ్ లో దొంగలు.. నగలు మాయం

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక శృంగేరి పీఠం, తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రమైన నల్లకుంట శంకర మఠంలో దొంగలు పడ్డారు. ₹18 లక్షల విలువైన బంగారాన్ని మాయం చేసారు. బయటి నుంచి వచ్చిన దొంగలు ఈ చోరీకి పాల్పడలేదని.. ఇంటిదొంగల పనేనని తేల్చారు పోలీసులు.

భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన నగలను మఠంలోన ఓ గదిలో భద్రపరుస్తుంటారు. ఆ గదినుంచి కొంత బంగారం మాయమైందని.. మఠం అధికారులు ఇటీవల గుర్తించారు.

ఈ విషయం శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఆదేశాలతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆఫీస్ వ్యవహారాలు చూస్తున్న క్లర్క్ స్థాయి ఉద్యోగి సాయిని నల్లకుంట పోలీసులు ప్రశ్నించారు. ఉద్యోగి సాయి తానే బంగారం దొంగతనం చేశానని… తిరిగి ఇస్తానని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా మేనేజర్ కృష్ణా రావు తెలిపారు.