ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డాటా చోరీ

ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డాటా చోరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్ది దారుల డేటా మొత్తం చోరీ అయ్యిందన్నారు వైసీపీ ప్రతినిధి విజయసాయి రెడ్డి. ఓ ప్రైవేట్  కార్యాలయంలో ఈ డేటా ఉందంటూ  ఆయన సైబరాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. దీని పై పోలీసులు విచార‌ణ ముమ్మ‌రం చేసారు. ఓట‌ర్ల జాబితా తొలిగింపు..చేరిక‌ల పై ఏపిలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న ప‌రిస్థితుల్లో ఇప్పుడు ఈ డేటా ప్రైవేటు కార్యాల‌యంలో దొర‌క‌టం సంచ‌ల‌నం గా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం చోరీకి గురైంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీ లు ఉన్నట్లు  వియజసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఆ కంపెనీలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.