లోన్ యాప్ అప్పులు తీర్చేందుకు..స్నేహితుడి ఇంట్లో చోరీ..రూ.7లక్షల బంగారం, నగదు అపహరణ

లోన్ యాప్ అప్పులు తీర్చేందుకు..స్నేహితుడి ఇంట్లో చోరీ..రూ.7లక్షల బంగారం, నగదు అపహరణ

లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని జల్సాలు.. అప్పు తీర్చేందుకు స్నేహితుడి ఇంటికే కన్నం..గుర్తు పట్టొద్దని లేడీగెటప్ వెళ్లి చోరీ.. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో స్నేహితుడి ఇంట్లో నగలు, డబ్బు చోరీ చేసిన ఓ టెక్నీషియన్ ను  ఆదివారం (సెప్టెంబర్21) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

 బంజారాహిల్స్ పరిధిలోని ఉదయనగర్ లో సెప్టెంబర్16న చోరీ జరిగింది. ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింగంపల్లి సిసి సమరలో  టెక్నిషియన్ గా పనిచేస్తున్న హర్షిత్ అనే యువకుడు స్నేహితుడు శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. హర్షిత్ ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. 

స్నేహితుడై శివరాజ్.. తన ఇంట్లో వాళ్లు ఊరికెళ్లారని హర్షిత్ తో చెప్పాడు.. లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకున్న హర్షిత్ .. ఎలా తీర్చాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో స్నేహితుడి ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. 

శివరాజ్ కుటుంబంతో నిజామాబాద్ కు వెళ్లగా.. బంజారాహిల్స్ లోని ఉదయనగర్ లోని శివరాజ్ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేశారు హర్షిత్. ఎవరూ గుర్తు పట్టకుండా లేడీ గెటప్ లో ఇంట్లో చొరబడి 6.75 తులాల బంగారం, రూ.1.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. 

శివరాజ్ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. హర్షిత్ పై అనుమానం వచ్చి విచారించడంతో తనే చోరీకి పాల్పడినట్టు ఒప్పుకున్నాఇంటికి వెళ్లి విచారించగా దొంగతనం వ్యవహారం బయటపడింది.నిందితుడి నుంచి 6.75తులాల బంగారం, 85వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.