ఒకటే జీవో రెండు విధాలుగా అమలు

ఒకటే జీవో రెండు విధాలుగా అమలు

సర్కార్ ఇచ్చింది ఒకటే జీవో. ఆ జీవోనే అధికార పార్టీకి ఓ రకంగా..విపక్షాలకు మరో రకంగా ఇంప్లీమెంట్ చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని సర్కార్ కొన్ని నిబంధనల్ని పెట్టింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు పెట్టొదని ఆదేశించింది. మాస్క్ మస్టని, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరని ఆర్డర్ ఇచ్చింది. ఇవేమీ అధికార పార్టీ నేతలకు వర్కవుట్ కావడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ రూల్స్ దాటేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు రూల్స్ ఫాలో కావడం లేదన్న ఆరోపణలున్నాయి.

డిసెంబర్ 29న సీఎం కేసీఆర్ నల్గొండ టూరులో వందలాది మంది పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మాస్క్ కూడా పెట్టుకోలేదు. మాస్క్ లేకుంటే ఫైన్లు వేసే..అధికారులు కూడా మాస్క్ మరిచిపోయారు. మంత్రి కేటీఆర్ కూడా సేమ్ టు సేమ్. మిధాని ఫ్లైఓవర్, షేక్ పేట్ ఫైఓవర్ ప్రారంభోత్సవాలు, నల్గొండలో ఐటీ టవర్ కార్యక్రమంలో వందలాది మంది పార్టిసిపేట్ చేశారు. నల్గొండలో కేటీఆర్ మాస్క్ లేకుండానే పెద్ద ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే. మాస్కుల్లేవు...ఫిజికల్ డిస్టెన్స్ ముచ్చటే లేదు. వీళ్లకు ఎక్కడ అడ్డంకులుండవు. పోలీసులు కూడా అక్కడే ఉంటారు. విపక్షాల నేతలకు మాత్రం అన్ని రూల్స్ ఎదురొస్తాయన్న ఆరోపణలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాల కార్యక్రమాలకు కరోనా రూల్స్ పేరుతో బ్రేకులు వేస్తున్నారు పోలీసులు.