జపాన్ చిత్రం గుర్తుండిపోతుంది : ఎస్.ఆర్.ప్రభు

జపాన్ చిత్రం గుర్తుండిపోతుంది :  ఎస్.ఆర్.ప్రభు

కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘జపాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌పై రూపొందిన ఈ సినిమా  నవంబర్ 10న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ ‘రాజు మురుగన్ చెప్పిన  కథ కార్తి గారికి చాలా నచ్చింది. జపాన్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా. కార్తి చేసిన పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. రాజు మురుగన్ ఆలోచనలు చాలా విలక్షణంగా ఉంటాయి.

ఆయన సమాజాన్ని చూసే విధానం, ఏదైనా విషయాన్ని చెప్పే విధానం యూనిక్‌గా ఉంటుంది. నవ్విస్తూనే ఆలోజింపజేస్తారు.  కార్తి కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రతిసారీ ఏదో కొత్తది చేయడానికి ప్రయత్నిస్తారు. జపాన్ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది. గెటప్, వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.  జపాన్ పాత్ర సీరియస్ గానే ఉంటుంది.

అయితే అతను ఏదైనా ఒక విషయాన్ని చూసే తీరు, మాట్లాడే విధానం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇందులో మానవత్వం గురించి కూడా ఉంటుంది. సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి.   అను ఇమ్మాన్యుయేల్ పాత్ర ఊహాతీతంగా ఉంటుంది. సునీల్ గారు డిఫరెంట్ క్యారెక్టర్‌‌లో ఆకట్టుకుంటారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదలవడం హ్యాపీగా ఉంది’ అని చెప్పారు.