2 లక్షల మంది స్టూడెంట్స్ ఇళ్లల్లో టీవీలు లేవు..పాఠాలు వినుడెట్ల?

2 లక్షల మంది స్టూడెంట్స్ ఇళ్లల్లో టీవీలు లేవు..పాఠాలు వినుడెట్ల?
  • ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నచోట ఇబ్బందులు
  • సగం టీవీల్లో కనిపించని టీశాట్ ప్రసారాలు
  • అన్ని జిల్లాల్లో పరిస్థితి..ఆందోళనలో పేరెంట్స్ ,స్టూడెంట్స్
  • ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నమంటున్న అధికారులు

సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సర్కారు బడి పిల్లలకు డిజిటల్ పాఠాలు ప్రారంభం కానున్నాయి. కానీ రాష్ట్రంలో  దాదాపు రెండు లక్షల మంది స్టూడెంట్స్  ఇండ్లలో టీవీలే లేవని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. దీనికి తోడు టీవీలు ఉన్నా కొన్ని చోట్ల టీశాట్ ప్రసారాలు రావడం లేదు. మరో వైపు ఇద్దరు ,ముగ్గురు స్టూడెంట్స్ ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది.దీంతో పిల్లలు డిజిటల్ పాఠాలు టీవీలో చూడటం, వినడం అనేది ప్రశ్నార్థకంగా మారింది.

18 లక్షల మంది స్టూడెంట్లు

రాష్ట్రంలో మొత్తం 597 మండలాల పరిధిలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 18 లక్షల మంది సర్కారీ స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరికీ సెప్టెంబర్ 1 నుంచి దూరదర్శన్ యాదగిరి, టీశాట్ చానల్స్ ద్వారా డిజిటల్ పాఠాలు చెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఎంతమంది ఇండ్లలో టీవీలున్నాయి. డీటీహెచ్,కేబుల్ కనెక్షన్స్ ఎన్నెన్ని ఉన్నాయి. ఎంత మంది వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి. తదితర వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు టీచర్ల ద్వారా గతంలోనే సేకరించారు. 16 లక్షల మంది స్టూడెంట్ల ఇండలలో టవీల లేదా ఆండ్రాయిడ్ సెల్ ఫోన్,ట్యాప్ టాప్, కంప్యూటర్..ఇలా ఏదో ఒక దాని ద్వారా పాఠాలు వినేందుకు అవకాశముంది.

మరో రెం డు లక్షల మంది ఇండ్లలో టీవీలు లేవని తేలింది. టీవీలు ఉన్న 10 లక్షల మంది ఇండ్లలో కేబుల్స్ ద్వారా ప్రసారాలు వస్తున్నాయి. రాష్ర్టంలో టీవీలున్న ఇండ్లలో నూ సగానికి పైగా వాటిలో టీశాట్ ప్రసారా లు రావడం లేదు. డీటీహెచ్ నెట్ వర్క్స్‌‌లో కేవలం ఎయిర్ టెల్ మినహా మిగిలిన వాటిలో రావడం లేదు. మరోవైపు సుమారు 12 లక్షల మంది స్టూడెంట్స్ ఇండ్లలో సెల్‌ ఫోన్లు ఉన్న ట్టు గుర్తించారు. వీటిలో ఆరు లక్షల మంది సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది.

ఇంట్లో ఇద్దరు, ముగ్గురుంటే?

ప్రస్తుతం ఒక్కో ఇంట్లో ఒక్కరే స్టూడెంట్ ఉంటే, టీవీల ద్వారా ప్రశాంతంగా పాఠాలు వినే అవకాశముంది. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న చోట సమస్యగా మారే అవకాశముంది. ఒకేసారి దూరదర్శ న్ యాదగిరి, టీశాట్ చానల్స్‌‌లో వేర్వేరు తరగతులకు క్లాసు లు వస్తే, ఎవరు పాఠాలు వినాలి..? అనేది ఇబ్బందిగా మారొచ్చు. సెల్‌ ఫోన్లకు వర్క్‌‌షీట్లు పంపిస్తామని, దీంతో పాటు పాఠాలకు సంబంధించిన లింకులు కూడా పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, గద్వాల జోగులాంబ, ఆదిలాబాద్, నిజామాబాద్ , ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతదితర జిల్లాల్లోఎక్కువ మందికి టీవీలు లేవని అధికారుల సర్వేలో తేలింది.

టీవీలు లేకపోతే ఎలా?

టీవీలు లేని స్టూడెంట్స్.. ఆ క్లాసు విద్యార్థుల ఇండ్లలో పాఠాలు వినేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. దగ్గరలో క్లాస్ స్టూడెంట్స్ లేకపోతే, పంచాయతీల్లో లేదా ఇతర గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏర్పా ట్లు చేస్తామని అంటున్నారు. అదీసాధ్యం కాకపోతే బడుల్లోనే పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు గ్రామాల్లో కేబుల్స్ద్వారా, అన్ని డీటీహెచ్‌‌లోనూ టీశాట్ ప్రసారాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు.