కిచెన్ క్లీనింగ్ కు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి

కిచెన్ క్లీనింగ్ కు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి

ఆరోగ్యానికి వంటగదికి చాలా సంబంధం ఉంది. కిచెన్ క్లీన్ గా ఉంటేనే  ఇంట్లో ఉన్నవారంతా హెల్దీగా ఉంటారు. లేదంటే కొన్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్​లు పెరిగిపోతాయి. అందుకే  ప్రతిరోజూ కిచెన్ ను క్లీన్ చేసుకోవాలి. అయితే చాలామంది కిచెన్ క్లీన్ చేయడం పెద్ద పని, ఎక్కువ టైమ్ పడుతుందని అనుకుంటారు. కానీ  చిన్నచిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే చాలా తక్కువ టైమ్​లో వంటగదిని శుభ్రం చేసుకోవచ్చు.

కిచెన్ లో బ్యాక్టీరియా ఎక్కువగా సింకులపైనే ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంట్లో  స్టీల్ సింక్​లుంటే వాటికి పట్టిన మురికిని బేకింగ్ సోడా ఉపయోగించి క్లీన్  చేసుకోవచ్చు. ముందు సింకులపై చల్లి కాసేపు వాటిని వదిలేయాలి.ఈ టైమ్​లో వేరే పనులు చేసుకోవచ్చు. కాసేపయ్యాక బ్రష్ తో బేకింగ్ సోడా చల్లిన ప్రదేశాల్లో రెండు నిమిషాలు రుద్దితే చాలు సింకులు  నీట్​గా మారిపోతాయి. 

స్టవ్​ బర్నర్ పై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే.. వాటిని అమోనియా, నీళ్లతో నింపిన జిప్​లాక్  బ్యాగ్ లో బర్నర్లు వేసి రాత్రంతా పక్కనపెట్టాలి. ఉదయం లేచాక వాటివి డిష్​వాషర్​తో శుభ్రం చేసుకోవాలి.

కటింగ్ బోర్డులు, చాకులు, పీలర్లు క్లీన్ చేయాలంటే రాళ్ల ఉప్పులో కాస్త నిమ్మరసం, నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో వీటిని వేసి ఒక గంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత  వాటిని మంచినీళ్లతో కడిగితే మెరిసిపోతాయి.

 మైక్రోవేవ్ ఒవెన్​ను క్లీన్ చేయాలంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి.. అందులో  కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి కలపాలి. వీటిని హై టెంపరేచర్ లో మైక్రోవేవ్ లో మూడు నిమిషాల పాటు ఉంచాలి.  హీటింగ్ టైమ్​ అయిపోయినా కూడా చల్లారేంతవరకు ఒవెన్ లోనే ఆ గిన్నెను ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసేసి ఒవెన్ లోపల తడి బట్టతో క్లీన్ చేసుకోవాలి.