చెన్నై: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్నాటకకు చెందిన ఆల్‌రౌండర్ మెక్‌నీల్ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నారు. మే 3న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ పాదానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఇక 24 ఏళ్ల మెక్‌నీల్‌ను సీఎస్‌కే రూ. 30 లక్షల బేస్‌ప్రైస్‌కే తీసుకుంది. 2024–25 సీజన్‌లో సీకే నాయుడు ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన మెక్‌నీల్‌కు బీసీసీఐ నమన్ అవార్డుల్లో ఎంఏ చిదంబరం ట్రోఫీని అందుకున్నాడు. కర్నాటక తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలోనూ రాణించాడు.
