గోల్కొండ కోట వద్ద మీడియాపై ఆంక్షలు

గోల్కొండ కోట వద్ద మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్ : గోల్కొండ కోట వద్ద మీడియాపై పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట గేట్ బయట కూడా మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు ఉండకూడదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు.. కొంతమంది మీడియా సిబ్బంది పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం పలు విమర్శలకు దారి తీసింది. హై సెక్యూరిటీ జోన్ లో ఎలా ఉంటారంటూ బయటకు పంపించి వేశారు. గోల్కొండ మెయిన్ గెట్ లోపల ఉన్న వాళ్లకు మాత్రమే పాస్ అవసరం అని అధికారులు చెబుతున్నారు.