అల్లు అర్జున్కు శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ ఇంటి వద్ద సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

అల్లు అర్జున్కు శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ ఇంటి వద్ద సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాలోని నటనకు అల్లు అర్జున్ ను జాతీయ అవార్డు వరించింది. దీంతో అన్ని వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ప్రకటించిన 69 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో  ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుపొందడంతో ఆయనకు చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

జూబ్లీహిల్స్ లోని బన్నీ  నివాసం వద్ద సినీ ప్రముఖుల సందడి కనిపిస్తోంది. చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపేందుకు బన్నీ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద కోలాహలం కనిపిస్తోంది. 

అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో  డైరెక్టర్ రాఘవేందర్ రావు, మారుతి, బుచ్చి బాబు, సింగర్ కాలభైరవ, మాజీ మంత్రి గంట శ్రీనివాస్ ఉన్నారు.  మరోవైపు.. అల్లు అర్జున్ నివాసానికి మెగా హీరో వరుణ్ తేజ్ చేరుకున్నారు. ఇటు అల్లు అర్జున్ అన్న నిర్మాత అల్లు బాబీ కూడా వెళ్లారు. అంతకుముందు..నిర్మాత దిల్ రాజు కూడా బన్నీ ఇంటికి వెళ్లి.. విషేష్ తెలియజేశారు.

మరోవైపు.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు నెటిజన్లు విషేష్ తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌ కు సినీ  పరిశ్రమలో ప్రత్యేక క్రేజ్‌ ఉంది. చిన్నప్పుడే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

పుష్ప ది రైజ్‌ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద అల్లు అర్జున్ సత్తా చాటారు. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.