మన పోరాటాలు భవిష్యత్ తరాలను నిర్ణయిస్తాయి : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

 మన పోరాటాలు భవిష్యత్ తరాలను నిర్ణయిస్తాయి : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

రేపటి తరాల భవిష్యత్తు మన పోరాటాలపైనే ఆధారపడి ఉందని అన్నారు వివేక్. ఎంతో కులవివక్ష ఉన్నప్పటికీ డా.అంబేడ్కర్ 23 డిగ్రీలు సాధించారని చెప్పారు. అంబేడ్కర్ పోరాటాల ఫలితంగానే మనం ఇప్పుడు ఇలా ఉన్నామని.. మన పోరాటాలు మన భవిష్యత్ తరాలను నిర్ణయిస్తాయని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. ‘తిరుపతి మాలల ఆత్మీయ సభ’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. 

మాల జాతి తక్కువగా ఉంది.. ఏం చేసినా కొట్లాడరనే భావన ప్రభుత్వాలలో ఉందని, అందుకే మాలల విషయంలో ప్రభుత్వాలు, నాయకులు అన్యాయం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘తిరుపతి మాలల ఆత్మీయ సభ’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఏం చేసినా మాలలు పట్టించుకోరు అనే భావన ప్రభుత్వాలలో ఉందని.. మనం కొట్లాడినప్పుడే అది పోతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఈ ఆలోచన మాలల్లో రాకుంటే రాబోయే కాలంలో మాలలను అణచి వేస్తారని హెచ్చరించారు. కొట్లాడకుంటే పని జరగదని అన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే డిస్క్రిమినేషన్ ఉందో అక్కడ అఫమేషన్ పాలసీ ఉందని.. ఎవరైతే అణచివేయబడతారో.. వారిని అన్ని విధాల పైకి తీసుకొచ్చి.. అందరికీ సమాన స్థాయిలో తీసుకురావాలనే పాలసీలు అమలు చేస్తున్నారని అన్నారు. కానీ ఇండియాలోనే అలాంటి పాలసీ లేదని అన్నారు. మాలలు కలిసికట్టుగా పోరాడినప్పుడే భవిష్యత్తు.. రాబోయే తరాల పిల్లల భవిష్యత్తు బాగుంటుందని గుర్తు చేశారు.