‘ముందస్తు’ వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ

‘ముందస్తు’ వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ

స్టేట్  బీజేపీలో ఎలక్షన్ హడావిడి కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు చర్చ జరగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దమేనంటోంది.  వరుసగా జిల్లా ముఖ్యనేతలతో సమావేశమవుతూ కేడర్ ను సన్నద్దం చేస్తోంది.  

రాష్ట్ర బీజేపీలో ఎన్నికల మూడ్  కనిపిస్తోంది. జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది పార్టీ. ముందుగా ఉత్తర తెలంగాణ జిల్లా నాయకత్వంతో వరుసగా సమావేశం అవుతున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. నిర్మల్, మంచిర్యాల జిల్లాల ముఖ్యనేతలతో  ఇప్పటికే సమావేశం అవ్వగా, మంగళవారం నిజామాబాద్, బుధవారం ఆసిఫాబాద్ , కామారెడ్డి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. నియోజకర్గాల వారిగా పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం,పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు,పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలపై ఆయా జిల్లాల ముఖ్యనేతలతో  చర్చిస్తున్నారు బండి సంజయ్. ఓ వైపు పాదయాత్ర చేస్తూనే మరో వైపు జిల్లా నేతలతో రాత్రి సమయాల్లో సమావేశం అవుతున్నారు. పాదయాత్ర  ముగియగానే బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు సంజయ్.

మరోవైపు కిషన్ రెడ్డి  కూడా హైదరాబాద్ లో పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకోవైపు లక్ష్మణ్,డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ రావు కేసీఆర్ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ వైఫల్యాలపై ఎంపీ అర్వింద్ నేతృత్వంలోని పార్టీ నియమించిన కమిటీ ఇప్పటికే ఓ రిపోర్ట్ ను రెడీ చేసింది.ఈ రిపోర్ట్ ప్రకారమే కేసీఆర్ వైఫల్యాలను  ఎన్నికల్లో ఎండగడుతామంటోంది బీజేపీ.

ఇక ముందుస్తు ఎన్నికలొస్తే పాదయాత్ర పరిస్థితి ఏంటనే అంశంపైనా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే... పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం లేనందున... పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేపట్టే అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు సంజయ్. జనవరిలో బస్సు యాత్రను చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు.  పాదయాత్రలో కవర్ అయినా అసెంబ్లీ సమావేశాలు మినహా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలను బస్సు యాత్రలో కవర్ చేసేలా కార్యచరణ రుపొందించారు.

బండి సంజయ్ బైంసా నుంచి కరీంనగర్ వరకు చేపట్టిన ఐదో విడత పాదయాత్ర ఈ నెల 16న కరీంగనర్ లో ముగుస్తుంది.ఈ ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా  హాజరుకానున్నారు.ఇప్పటికే రాష్ట్ర పార్టీ నడ్డా అపాయింట్ మెంట్ కోరింది.నడ్డా రాష్ట్ర పర్యటన కూడా ఖరారు అయినట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐటి,ఈడి, సిబిఐ దాడులతో పాటు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న  టైంలో జేపి నడ్డా రాష్ట్రానికి వస్తున్నారు.ఈ టైంలో పాదయాత్ర ముగింపు సభలో రాష్ట్ర  రాజకీయ అంశాలపై నడ్డా ఏం మాట్లాడబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు ఉంటామో లేదో కానీ  బీజేపీ నేతలు మాత్రం బిజీబిజీ అయ్యారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చిన  సిద్దమేనని...అధికార పార్టీకి ఆల్టర్ నేటివ్ తామే అంటున్నారు.