అక్కడ కరోనా మరణాల్లేవ్

అక్కడ కరోనా మరణాల్లేవ్

న్యూఢిల్లీ, వెలుగు: మన దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 4 రోజుల్లోనే 900 మంది చనిపోయారు. అయితే దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం నమోదు కాలేదని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రానగర్ హవేలి, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపురలో ఒక్కరూ కరోనాతో చనిపోలేదని చెప్పింది. లాక్ డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేయడం, ఫిజికల్స్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడంతోనే వైరస్ ను కట్టడి చేయగలిగామని ఆ రాష్ట్రాలు, యూటీలు ప్రకటించాయి. ఏ ఒక్కరి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించాయి.

For More News..

వానకాలం పంటలకు ఎరువులు ఎట్ల?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొవ్వు పెరుగుతోంది

ఈసారి బోనాల పండుగ లేనట్లే

50 ఏళ్లు దాటితే.. గండమే