అవినీతి ప్రభుత్వం పోవాలని ప్రజలు చూస్తున్నారు

అవినీతి ప్రభుత్వం పోవాలని ప్రజలు చూస్తున్నారు

ఢిల్లీ: శ్రవణ్ బీజేపీలో చేరడం చాలా విశిష్టమైన కార్యాచరణ అని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో  దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ ఉద్యమంలో దాసోజు శ్రవణ్ కీలకపాత్ర పోషించారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశాడని.. సొంత పార్టీలో ఉన్న వారిని కూడా బయటికి పంపించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన దాసోజు శ్రావన్ ను కూడా పార్టీ నుంచి పంపాడని తెలిపారు. శ్రవణ్ జాయిన్ అవడం వల్ల రాష్ట్రంలో బీజేపికీ మరింత బలం పెరిగిందన్నారు.

రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం మరింత కష్టపడాలని.. కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున బీజేపీలో జాయినింగ్స్ అవుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ,  కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని.. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బండి సంజయ్ పాదయాత్రలో కూడా ప్రజల స్పందన మంచిగా ఉందని.. అవినీతి ప్రభుత్వం పోవాలని ప్రజలు చూస్తున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.