బెదిరింపులకు లొంగేది లేదు: కేసీఆర్

బెదిరింపులకు లొంగేది లేదు: కేసీఆర్
  •     పని చేయకపోతే పదవి నుంచి దింపేస్తం
  •     భయపడితే భయపెడ్తనే ఉంటరు
  •     చట్టాలు చేసేసినం.. మార్పులు ఉండవు
  •     వచ్చే ఎన్నికల్లో ఓడిస్తరా?.. ప్రతిపక్షంలో కూర్చుందాం
  •     తెగేదాకా లాగితే నష్టపోయేది వారేనని కామెంట్
  •     బడ్జెట్‌ సమావేశాల్లో సభ ముందుకు రెవెన్యూ యాక్ట్‌

పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలు ఇప్పటికే తీసుకువచ్చాం. వాటిలో ఇక ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా గవర్నర్‌ కోరిన సవరణలు అంత పెద్దవేం కాదు. జనం టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఆధిక్యం ఇచ్చారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేము.కొత్త రెవెన్యూ చట్టం కూడా రెడీ అయింది. బడ్జెట్‌ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడుతుంది.ఆ చట్టం కూడా కఠినంగానే ఉండబోతోంది. దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు,వీఆర్వోల నుంచి రైతులు, ప్రజలు ఎదుర్కొన్న పీడకు విముక్తి లభించబోతోంది.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు‘‘ఎవరి బెదిరింపులకూ లొంగేది లేదు. సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎవరికి నష్టం. వాళ్ల పదవులే పోతయి. ఉప సర్పంచులు పవర్లకు వస్తరు. ఆరు నెలల్లో ఎలక్షన్లు పెట్టుకోవచ్చు. మనం నిధులిస్తం, పనిచెయ్యిమంటం, చెయ్యకపోతే పదవి నుంచి దింపేస్తం.. కలెక్టర్లకే ఆ అధికారం ఉంటది. అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఇంటికి పంపిస్తం.. వాళ్లేదో చేస్తరని భయపడితే ఎట్ల? భయపడుతూ పోతే భయపెడ్తనే ఉంటరు. వ్యవస్థలను ప్రక్షాళన చేసి తీరాల్సిందే. అయితే గియితే ఏమైతది.. వచ్చే ఎలక్షన్ల ఓడిస్తరు గావొచ్చు.. రెండుసార్లు పవర్‌‌‌‌‌‌‌‌ల ఉన్నం.. ఓడిస్తే అపోజిషన్ల కూర్చుందాం.. అంతేగానీ ఎవరికి భయపడేది లేదు..’’ అని టీఆర్ఎస్​ కీలక నేతలతో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది లేదని కూడా పేర్కొన్నారు. పార్టీ నేతలు రెండు రోజుల కింద సీఎం కేసీఆర్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచులు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌, ఇతర ఉద్యోగులను తొలగిస్తామన్న ప్రకటనలతో పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకరిద్దరు ప్రస్తావించినట్టు తెలిసింది. కేసీఆర్​తో చనువుగా ఉండే ఒకరిద్దరు నేతలు ఈ విషయంలో సర్దిచెప్పబోయినా.. సీఎం తన నిర్ణయమే ఫైనల్‌‌‌‌‌‌‌‌ అని తేల్చిసినట్టు సమాచారం.

చట్టాలు తెచ్చేసినం..

పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చట్టాలు ఇప్పటికే తీసుకువచ్చామని వాటిలో ఇక ఎలాంటి మార్పులు ఉండబోవని సీఎం స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా  గవర్నర్‌‌‌‌‌‌‌‌ కోరిన సవరణలు అంత పెద్దవేం కాదని, ఎలక్షన్​ తేదీలను నిర్ణయించే అధికారాన్ని ఈసీకి ఇవ్వాలన్న సవరణ మాత్రమే సూచించారని చెప్పినట్టు సమాచారం. జనం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు తిరుగులేని ఆధిక్యం ఇచ్చారని, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేమని అన్నట్టు తెలిసింది. ‘‘కొత్త రెవెన్యూ చట్టం కూడా రెడీ అయింది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడుతుంది. ఆ చట్టం కూడా కఠినంగానే ఉండబోతోంది. దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు, వీఆర్వోల నుంచి రైతులు, ప్రజలు ఎదుర్కొన్న పీడకు విముక్తి లభించబోతోంది. ఆ బిల్లు చట్ట రూపం దాల్చిన రోజు ప్రజలే ప్రభుత్వానికి అండగా నిలుస్తారు..” అని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.

తెగేదాకా లాగొద్దని చెప్పండి..

ఉద్యోగ సంఘాలు బెదిరింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటున్న వాళ్లు జవాబుదారీగా పనిచేసి తీరాల్సిందేనని కేసీఆర్​ అన్నట్టు సమాచారం. ‘‘వాళ్లు ప్రభుత్వాలను ఏదో చేస్తామనే భ్రమలో ఉంటే వాళ్లకే నష్టం. ఈ విషయం ఆయా సంఘాల నేతలకు తేల్చిచెప్పండి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చామనే విషయాన్ని వారికి గుర్తు చేయండి. తెగేదాకా లాగితే ఫైనల్‌‌‌‌‌‌‌‌గా నష్టపోయేది ఉద్యోగులే అన్న విషయంలో క్లారిటీ ఇవ్వండి” అని ఒక సీనియర్​ నేతకు సూచించినట్టు తెలిసింది. తన నిర్ణయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవని, ఉంటాయని ఆశించడం కూడా అత్యాశే అవుతుందని కామెంట్​ చేసినట్టు సమాచారం. సీఎంతో భేటీలో పాల్గొన్న ఒకరిద్దరు కీలక నేతలు.. తర్వాత ఈ విషయాలను తమకు సన్నిహితంగా ఉండేవారితో పంచుకున్నారు.