రాష్ట్రంలో ఉద్యోగ భద్రత లేదు

రాష్ట్రంలో ఉద్యోగ భద్రత లేదు

​​​​ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఉద్యోగులను బదిలీల పేరుతో ఇబ్బందులు పెడుతూ.. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఔట్​సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక నిబంధనల ప్రకారం విధుల్లో చేరిన ఔట్​సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఎలా తొలగిస్తారని నిలదీశారు. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి చేయలేదని మండిపడ్డారు. 

విధుల్లోకి తీస్కోవాలె: ఆర్.కృష్ణయ్య
టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరుద్యోగులకు వయోపరిమితులు దాటిపోయాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 376 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను ఎట్లా తొలగిస్తారని ప్రశ్నించారు.