చనిపోయిన రైతుల సమాచారమే లేదు.. సహాయం ఎలా?

చనిపోయిన రైతుల సమాచారమే లేదు.. సహాయం ఎలా?

న్యూఢిల్లీ: రైతు ఉద్యమంలో చనిపోయినవారికి సాయం అందించే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు చేసి మరణించిన 750 మంది రైతులకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని.. అసలు ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటూ ప్రతిపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి తోమర్ స్పందించారు.

రైతు ఉద్యమంలో మరణించిన రైతుల గురించి ఎలాంటి సమాచారం  లేదు, అలాంటప్పుడు సహాయం అందించే  ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రైతుల మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుబాలకు ఆర్థిక సహాయం, వారిపై నమోదైన కేసులు వంటి విషయాలపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాయి.