ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ లేదు

V6 Velugu Posted on May 06, 2021

  • కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్‌ 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి అవుతోందన్న వార్తలపై కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్‌ స్పందించారు. ఏపీలో కరోనా కొత్త మ్యూటెంట్ లేదని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా గుర్తించిన బీ167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మధ్యకాలంలో బీ618 రకాన్ని కనుగొన్నప్పటికీ.. అది త్వరగా కనుమరుగైందని రేణూ స్వరూప్‌ పేర్కొన్నారు. ఎన్‌440కే వైరస్‌ ప్రభావం దేశంలో ఎక్కడా కనిపించలేదని క్లారిటీ ఇచ్చారు. దేశంలో చాలా చోట్ల బీ167 వైరస్‌ ప్రభావం ఉందన్నారు.

Tagged Andhra Pradesh, Corona New Variant, Central Biotechnology Ministry Secretary Renu Swaroop, B167, N440

Latest Videos

Subscribe Now

More News