TSPSC : ప్రజాస్వామ్య దేశంలో దర్నా చేసే హక్కులేదు.. క్రిమినల్స్ లా ముందస్తు అరెస్టులెందుకు

TSPSC : ప్రజాస్వామ్య దేశంలో దర్నా చేసే హక్కులేదు.. క్రిమినల్స్ లా ముందస్తు అరెస్టులెందుకు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు అరకిలోమీటర్ ముందే షర్మిలను నిలవరించారు పోలీసులు. దాంతో షర్మిల తన కార్యకర్తలతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలంతా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. పేపర్ లీక్ ఘటనపై మాట్లాడిన షర్మిల.. తనేమీ క్రిమినల్ కాదని, అయినా, పోలీసులు తనకు లుక్ అవుట్ నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో దర్నాలు చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. దర్నాలంటే.. పోలీసులు ముందే హౌజ్ అరెస్టు చేస్తున్నారని, అందుకే తను నిన్న రాత్రే ఇంటినుంచి బయటికి వచ్చిన్లు పేర్కొన్నారు. తప్పు చేయకపోయినా హోటల్ రూమ్స్ లో తల దాచుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల.