డీల్కు తొందరేం లేదు .. ఇరాన్తో ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్

డీల్కు తొందరేం లేదు .. ఇరాన్తో ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తొలగించి, శాంతి నెలకొల్పేందుకు ఇరాన్​తో జరుపుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఒప్పందం విషయంలో తొందరపడొద్దని తమ ప్రతినిధులకు చెప్పానంటూ  ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పోస్టు పెట్టారు. ‘ఇరాన్‌తో చర్చలు సజావుగానే సాగుతున్నాయి. 

కానీ ఒప్పందాన్ని త్వరగా ముగించవద్దని నా ప్రతినిధులకు సూచించాను. ప్రస్తుత పరిస్థితుల్లో సమయం మనవైపే ఉంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసే వరకు ఇరాన్ ఓడరేవులపై బ్లాకేడ్ అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.