గోదావరిలో మిగులు జలాలు లేవు

గోదావరిలో మిగులు జలాలు లేవు
  • అంగీకరించిన కేంద్ర జల సంఘం
  • గోదావరి-కావేరి అనుసంధానానికి ఇక బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడ్డట్టే
  • చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ వాడుకోని నీటితో రివర్‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌
  • ఎన్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన.. సుముఖంగా లేని బేసిన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోదావరి నదిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఒప్పుకుంది. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా మీదుగా కావేరి నదుల అనుసంధానం చేపట్టేందుకు కొన్నేండ్లుగా జరుగుతున్న ప్రక్రియకు దీనితో బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడ్డట్టు అయ్యింది. గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా, అందులో ఎక్కువ మొత్తం నీళ్లు అతి తక్కువ రోజుల్లోనే (ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ ఫ్లడ్స్‌‌‌‌‌‌‌‌) బంగాళాఖాతంలో కలుస్తున్నాయనే వాదనతో సీడబ్ల్యూసీ ఏకీభవించింది. గోదావరిలో నీళ్లను అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు కాబట్టే ఎక్కువ మొత్తంలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, ప్రాజెక్టులన్నీ పూర్తయితే మిగులు జలాలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్న బేసిన్‌‌‌‌‌‌‌‌లోని రాష్ట్రాల వాదన నిజమేనని సీడబ్ల్యూసీ ఒప్పుకుంది.

రాష్ట్రాలకు డీపీఆర్ పంపిన ఎన్​డబ్ల్యూడీఏ 
గోదావరి నీళ్లను తెలంగాణలోని ఇచ్చంపల్లి/జానంపేట నుంచి ఎత్తిపోసి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్‌‌‌‌‌‌‌‌ ఆనికట్‌‌‌‌‌‌‌‌ (కావేరి)కు తరలించాలని ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించే డీపీఆర్‌‌‌‌‌‌‌‌ను నేష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ వాట‌‌‌‌‌‌‌‌ర్ డెవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ) రూపొందించి బేసిన్‌‌‌‌‌‌‌‌లోని రాష్ట్రాలకు పంపింది. రోజుకు 2.2 టీఎంసీల చొప్పున 143 రోజుల్లో మొత్తంగా 247 టీఎంసీల వరద నీళ్లను ఎత్తిపోస్తామని ప్రతిపాదించింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 9.44 లక్షల హెక్టార్లకు సాగునీరు, మూడు రాష్ట్రాల తాగు, పారిశ్రామిక అవసరాలను ఈ రివర్‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు తీర్చుతుందని ప్రతిపాదించింది. ఇందుకు ఇచ్చంపల్లి నుంచి కావేరి వరకు 1,211 కి.మీ. కాలువలు తవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.85,662 కోట్లుగా లెక్కగట్టింది. భూసేకరణ, ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్ ప్యాకేజీల భారం ఆయా రాష్ట్రాలు మోయాల్సి ఉంటుంది. వాటిని లెక్కలోకి తీసుకుంటే ప్రాజెక్టు వ్యయం రూ.లక్ష కోట్లు దాటుతుంది. మొత్తం తరలించే నీటిలో తెలంగాణకు 65.79 టీఎంసీలు, ఏపీకి 79.91, తమిళనాడుకు 84.30 టీఎంసీలు దక్కుతాయని తెలిపింది. మూడు రాష్ట్రాల్లో కలిపి 4.53 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు, 4.91 లక్షల హెక్టార్ల పాత ఆయకట్టు స్థీకరిచింవచ్చని ప్రతిపాదించింది.

మొదట్నుంచే డౌట్లు..
గోదావరిలో నీటి లభ్యతపై తెలంగాణ, ఏపీ మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. 75 శాతం డిపెండబులిటీ వద్ద నదిలో లభ్యమయ్యే నీళ్లు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలకే సరిపోతాయని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో మహానది నుంచి గోదావరికి లింక్‌‌‌‌‌‌‌‌ చేసి ఆ మిగులు నీటిని గోదావరి - కావేరి లింక్‌‌‌‌‌‌‌‌కు ఉపయోగించుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని ఏపీ, తెలంగాణ ప్రతిపాదించాయి. ఇందుకు ఓకే చెప్పిన ఎన్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ మహానది నుంచి గోదావరి లింక్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు చేపడుతామని హామీనిచ్చింది. ఇచ్చంపల్లి నుంచి చేపట్టే రివర్‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, ఒడిశా సైతం అభ్యంతరాలు తెలిపాయి. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ ఉపయోగించుకోని 176 టీఎంసీలతో పాటు ఇచ్చంపల్లి వద్ద గోదావరిలో లభ్యమయ్యే 71 టీఎంసీలను నదుల అనుసంధానానికి వినియోగిస్తామని ఎన్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. తమ రాష్ట్రం కోటాలోని నీటిని తరలించడానికి చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ ససేమిరా అంటోంది. తమ రాష్ట్ర అవసరాల కోసం మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు పేర్కొంది. ఇచ్చంపల్లి వద్ద లభ్యమయ్యే నీళ్లు తమ అవసరాలకే సరిపోతాయని తెలంగాణ చెప్తోంది. తమకు గోదావరిలో 954.23 నికర జలాల కేటాయింపు ఉందంటోంది. ఇవిపోను తాము వరద జలాలపై ఆధారపడి ఇంకో 450 టీఎంసీల వరకు ఉపయోగించుకునేందుకు కొత్త ప్రాజెక్టులు చేపట్టామని వివరించింది. ఈ పరిస్థితుల్లో మిగులు జలాల లభ్యత అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది.

అనుసంధానం ఆగినట్టే..
గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి బేసిన్‌‌‌‌‌‌‌‌లోని సుముఖంగా లేకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడ్డట్టేనని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చెన్నై మహానగర తాగునీటి అవసరాలతో పాటు తమిళనాడు సాగు నీటి అవసరాల కోసం నదుల అనుసంధానం చేపట్టాల్సి ఉన్నా, ఆయా రాష్ట్రాల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌ను తెరపైకి తెచ్చింది. తమ రాష్ట్రంలోని కరువు ప్రభావ ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచడం, పలు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా 320 టీఎంసీలు తరలించే ప్రాజెక్టు చేపట్టామని కేంద్రానికి వివరించింది. పోలవరం నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ దిగువన ఉన్న బనకచర్ల కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ వరకు తాము ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని, కేంద్రం తమతో కలిసి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని సూచించింది. దీంతో నదుల అనుసంధానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.