ఆక్సిజన్‌‌ ఉంది.. తీసుకెళ్లడమే కష్టం!

ఆక్సిజన్‌‌ ఉంది.. తీసుకెళ్లడమే కష్టం!

 కెపాసిటీని రోజుకి 2600 టన్నులకి పెంచాం
 లిండే ఇండియా ఎండీ అభిజిత్​ బెనర్జీ

న్యూఢిల్లీ: కరోనా సెకండ్​ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్​ ప్రొడక్షన్​ పెంచడానికి అన్ని రకాలుగాను ప్రయత్నిస్తున్నట్లు లిండే ఇండియా చెబుతోంది. నైట్రోజన్​లాంటి ఇతర గ్యాస్​ల కోసం ఉంచిన కంటెయినర్లనూ ఆక్సిజన్​ కోసమే వాడుతున్నట్లు వెల్లడిస్తోంది. డిమాండ్​ ఉన్న ప్రాంతాలకి ప్రొడక్షన్​ సెంటర్లు చాలా దూరంగా ఉండటంతో అక్కడికి చేర్చడం​ పెద్ద సమస్యగా మారిందని కంపెనీ పేర్కొంటోంది. దేశాన్ని మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి లిక్విడ్​ ఆక్సిజన్​ కొరత లేదు​. కానీ, ఫ్యూచర్​లో ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని లిండే ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ అభిజిత్​ బెనర్జీ చెప్పారు.  ఆక్సిజన్​ ప్రొడక్షన్​ జరిగే ప్రాంతాలకు, ఇప్పుడు కోవిడ్​ సెకండ్​ వేవ్​తో డిమాండ్​ పెరిగిన ప్రాంతాలకూ దూరం ఎక్కువగా ఉండటమే సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రోబ్లమ్​కి సొల్యూషన్​ వెతకడం మీదే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.