ఫోన్ ట్యాపింగ్​పై సమగ్ర విచారణ చేయాలి : తమ్మినేని వీరభద్రం

ఫోన్ ట్యాపింగ్​పై సమగ్ర విచారణ చేయాలి  : తమ్మినేని వీరభద్రం

 యాదాద్రి, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ ​చేశారు. కేంద్రంలోని బీజేపీ కూడా గతంలో ‘పెగాసెస్’ సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్​ చేసిందని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ట్యాపింగ్ ​చేసినట్టుగా కథనాలు వస్తున్నాయని తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన పార్టీ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​ రెడ్డి పాలన బాగుందని, ఇచ్చిన గ్యారంటీలు, హమీలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

 సీపీఎం పోటీ చేయని చోట బీజేపీని ఓడించడానికి ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇస్తామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని చట్టబద్ధం చేసిందని, లంచం రూపం మార్చిందని అన్నారు. అందులో భాగమే ఈ ‘ఎలక్ట్రోల్ బాండ్స్’​ అని తెలిపారు. ఈ బాండ్స్ పెద్ద స్కాం అని చెప్పారు.