పొలంపల్లిలో ఉద్రిక్తత..మూడు ఓట్లతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి

పొలంపల్లిలో ఉద్రిక్తత..మూడు ఓట్లతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి
  • రీకౌంటింగ్​ కోరిన ఓడిన అభ్యర్థి

 తిమ్మాపూర్​, వెలుగు: రెండో విడత జీపీ ఎన్నికల్లో భాగంగా  పొలంపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత జరిగింది. బొడిగె జ్ఞానేశ్వరి కొండయ్యను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ బలపరచగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన గుంటి లావణ్య మల్లేశం బరిలో నిలిచారు. లావణ్య మూడు ఓట్లతో గెలుపొందగా, రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థి రీకౌంటింగ్​ కోరారు. రీకౌంటింగ్​లోనూ లావణ్య గెలుపొందగా, అధికారులు ఆమె గెలుపును ప్రకటించకపోవడంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 

కొంతసేపు పోలీసులు, గ్రామస్తులకు నడుమ తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీపీ గౌస్​ ఆలం వెంటనే గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఎన్నికల అధికారులు తిరిగి లావణ్యను విజేతగా ప్రకటించారు.