కరెంట్ షాక్ తో రైతు మృతి

 కరెంట్ షాక్ తో రైతు మృతి

గండీడ్, వెలుగు : కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా మహమ్మదాబాద్  మండలం గాధిర్యాల్ గ్రామంలో శనివారం జరిగింది. ఎస్సై సురేశ్  తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు గండీటి అంజిలయ్య (48) శనివారం ఉదయం తన వరి పంట కోసేందుకు కోత మెషీన్  తీసుకెళ్లాడు.

పొలంలో ఉన్న కరెంట్ తీగలు యంత్రానికి తగులుతాయని ట్రాన్స్ ఫార్మర్  ఆఫ్  చేయడానికి వెళ్లి  ప్రమాదవశాత్తు కరెంట్  షాక్ తగిలి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.