రోడ్​షో నిర్వహించిన థెర్మాక్స్​

రోడ్​షో నిర్వహించిన థెర్మాక్స్​

హైదరాబాద్, వెలుగు:  ఎనర్జీ, ఎన్విరాన్​మెంట్​ ప్రొవైడర్ అయిన థెర్మాక్స్​ హైదరాబాద్‌‌లో శుక్రవారం రీడిస్కవర్ పేరుతో రోడ్​షో నిర్వహించింది.  పర్యావరణానికి మేలు చేసే పలు ప్రొడక్టులను ప్రదర్శించింది. వీటితో కంపెనీలు కాలుష్యాన్ని, వ్యర్థాలను తగ్గించుకొని డబ్బును కూడా ఆదా చేయవచ్చని ప్రకటించింది. వ్యర్థాలను శక్తిగా మార్చే బయోమాస్, హైబ్రిడ్ రెన్యువబుల్​, బయో -సీఎన్జీ, ఎలక్ట్రికల్/హైబ్రిడ్ హీటింగ్, కూలింగ్ సొల్యూషన్స్, గ్రీన్ హైడ్రోజన్  ఇంధన ఆధారిత పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. 

ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఆశిష్ భండారి మాట్లాడుతూ, “కరెంటును, శక్తి, నీటిని తక్కువగా ఉపయోగించుకునేలా చేసే వందలాది ప్రొడక్టులు మా దగ్గర ఉన్నాయి. తెలంగాణలో మాకు వందలాది మంది కస్టమర్లు ఉన్నారు.  థెర్మాక్స్​ కస్టమర్లు ముందస్తు కాపెక్స్ పెట్టుబడి, ఒపెక్స్, లేదా బిల్డ్-ఓన్-ఆపరేట్ (బీఓఓ) ద్వారా మా సేవలను పొందవచ్చు. మాకు దేశవిదేశాల్లో 19 ప్లాంట్లు ఉన్నాయి. చెన్నై, ఏపీలోనూ ప్లాంటు ఉన్నాయి. మేం ఫుడ్​, ఫార్మా, కెమికల్స్​, టెక్స్​టైల్స్​ వంటి సెక్టార్లకు ఎక్కువగా సేవలు అందిస్తాం”అని ఆయన వివరించారు.