రాగల 3రోజులు పొడి వాతావరణం..అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

రాగల 3రోజులు పొడి వాతావరణం..అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
  • హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ శాఖ సూచనలు విడుదల చేసింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్, దాని పరిసరప్రాంతాల్లో స్థిరంగా  కొనసాగుతూ  సముద్ర మట్టం నుండి 2.1 కి మీ వరకు వ్యాపించి ఉన్నదని.. ఈ రోజు ఉత్తర - దక్షిణ ఆవర్తనం ఉత్తర ఇంటీరియర్ కర్నాటక నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు 0.9 కి మీ వద్ద ఏర్పడిందని, ఈ ప్రభావంతో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం, ముఖ్యంగా తెలంగాణలోని తూర్పు జిల్లాలలో వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మిగతా జిల్లాలలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, ఈ నెల 5వ తేదీన కూడా పొడి వాతావరణము ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆది,సోమవారాల్లో(4,5తేదీలలో)వరంగల్ పట్టణ ,వరంగల్ గ్రామీణ,  జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో  ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి   వర్షములు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.