ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్లు ఇవే..

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్లు ఇవే..

ఇంతకుముందు ప్రేక్షకులు ప్రతీవారం ఏ సినిమాలు వస్తున్నాయో చెక్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతీవారం ఏయే సినిమాలు, సిరీస్లు ఓటీటీ ప్లాట్ ఫామ్లల్లో రిలీజవుతున్నాయో చూస్తున్నారు. దానికి తగ్గట్టు ప్రతీవారం కొన్ని సిరీస్లు సినిమాలు చూసుకోవడానికి షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఈ వారంలో రిలీజ్ అవుతున్న సిరీస్లు, సినిమాలపై ఓ లుక్కేద్దాం..

రానా సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’’ జూన్ 17న థియేటర్లలో రిలీజైంది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్తో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. సినిమా పరంగా బాగానే ఉన్నా ఎందుకో జనాలు థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. నక్సల్ బ్యాక్ డ్రాప్, వాళ్ల ఐడియాలజీ పెద్దగా నచ్చలేదు. అందుకే నిర్మాతలు రెండు వారాలు అవ్వగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 1న నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. మరి ఓటీటీలోనైనా ఈ సినిమాకు పేరు వస్తుందోమో చూడాలి. 

 

అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా నిలబడలేకపోయింది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత నిలబడలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో జులై 1న ప్రసారం కానుంది.

రెజీనా ,నివేదితా సతీష్ నటించిన వెబ్ సిరీస్ ‘‘ఆన్యాస్ ట్యుటోరియల్’’. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ జులై 1 నుండి ఆహాలో ప్రసారం కానుంది. బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ఈ సిరీస్కు నిర్మాత. ఈ సిరీస్తో పాటే ఆహాలో మరో కిడ్ సిరీస్ ‘‘బాల భారతము’’ జులై 1 నుండే ప్రసారం కాబోతుంది.  హాలీవుడ్ పాపులర్ సిరీస్ ‘‘స్ట్రేంజర్ థింగ్స్’’ సీజన్ 4 - జులై 1 నుండి నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీ మూవీ ‘‘ధాకడ్’’ కూడా జూలై 1 న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు స్పైడర్ మాన్ 1,2,3  సీక్వెల్స్, అమేజింగ్ స్పైడర్ మేన్, స్పైడర్ మేన్ హోమ్ కమింగ్ సినిమాలు ఇంగ్లీష్ వెర్షన్లో హాట్ స్టార్ లో జులై 1 నుండి అవేలబుల్గా ఉన్నాయి.