రైతు వేదికల్లో అందించే సేవలు ఇవే

రైతు వేదికల్లో అందించే సేవలు ఇవే

రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో బుధవారం  నుంచి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మధ్యహ్నం 12 గంటలకు సెక్రటేరియెట్‌‌‌‌ నుంచి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా  వీడియో కాన్ఫరెన్స్ సేవలను ప్రారంభించనున్నారు.  అనంతరం  రైతులతో  మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. 

రైతు వేదికల్లో వచ్చే కొత్త టెక్నాలజీతో  వ్యవసాయ,  అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి, సాగుపై సలహాలు ఇవ్వనున్నారు. పంటల చీడ పీడలపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త స్కీములపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.  వివిధ శాఖల మంత్రులు కూడా నేరుగా రైతులతో మాట్లాడే వీలు కలుగుతుంది. 

Also read : మోదీని పెద్దన్న అంటే తప్పేముంది : సీఎం రేవంత్ రెడ్డి

రైతులు కూడా  తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలిపే అవకాశం కల్పిస్తారు. బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాలు, వివిధ స్కీములు వివరించే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు పశుసంవర్థక శాఖ వెటర్నరీ డాక్టర్లు రైతులకు సలహాలు అందించనున్నారు. రైతు వేదికల్లోని టెక్నాలజీ ద్వారా రైతులతో నేరుగా సమావేశమై ముఖాముఖిగా ప్రతీ సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించుకునే వీలు కల్పిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.