లాక్ డౌన్ పొడిగించిన రాష్ట్రాలు ఇవే..

లాక్ డౌన్ పొడిగించిన రాష్ట్రాలు ఇవే..

మహారాష్ట్రలో.. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించిన సీఎం ఉద్ధవ్ థాక్రే స్టేట్‌‌‌‌లో లాక్ డౌన్ ను మరో15 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. అయితే జూన్ 1 నుంచి కొన్ని ఆంక్షలను సడలిస్తామని, మంగళవారం దీనిపై కొత్త గైడ్ లైన్స్‌‌‌‌ ను విడుదల చేస్తామని స్టేట్ హెల్త్ మినిస్టర్ రాజేశ్ తొపే శనివారం ప్రకటించారు.
కర్నాటకలో..  రాష్ట్రంలో లాక్‌‌డౌన్‌‌ గడువు జూన్ 7 వరకూ ఉంది. అంతకంటే రెండ్రోజుల ముందు లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం యెడియూరప్ప నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కేంద్రం సూచనల మేరకు జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
తమిళనాడులో..  రాష్ట్రంలో కొనసాగుతున్న ఫుల్ లాక్‌‌డౌన్‌‌ను జూన్ 7 వరకూ పొడిగించారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని.. అధికారులకు సహకరించాలని సీఎం ఎంకే స్టాలిన్‌‌ కోరారు.

ఇంకిన్ని రాష్ట్రాల్లో ఇలా.. 
హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో జూన్‌‌‌‌ 7 వరకు, రాజస్థాన్‌‌‌‌లో జూన్ 8 వరకు, కేరళలో జూన్ 9 వరకు, పంజాబ్‌‌‌‌లో  జూన్ 10 వరకు, నాగాలాండ్‌‌‌‌లో జూన్ 11 వరకు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్రాలు ప్రకటించా యి. వెస్ట్ బెంగాల్‌‌‌‌లో జూన్ 15 వరకూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. గోవాలో కర్ఫ్యూను జూన్ 7 వరకూ పొడిగిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లో 7 జిల్లాల్లో లాక్ డౌన్‌‌ను జూన్ 7 వరకూ పొడిగించారు.