Good Health : ఈ డ్రై ఫ్రూట్స్ ఇడ్లీని టిఫిన్.. స్నాక్స్గా తీసుకోవచ్చు.. డిన్నర్గా తినొచ్చు..!

Good Health : ఈ డ్రై ఫ్రూట్స్ ఇడ్లీని టిఫిన్.. స్నాక్స్గా తీసుకోవచ్చు.. డిన్నర్గా తినొచ్చు..!

ఇడ్లీ, దోశె, ఉప్మా.. బ్రేక్‌ పాస్ట్ లో మాత్రమే తింటారు చాలామంది. అయితే, వీటినే కొంచెం వెరైటీగా చేసుకుంటే సాయంత్రం స్నాక్ గా, డిన్నర్ ఐటమ్ కూడా తినొచ్చు. పైగా పిల్లలు కూడా ఇలాంటి కొత్త వంటకాలను ఇష్టంగా తింటారు. అలాంటివే ఇవి.

డ్రై ఫ్రూట్స్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు:

ఇడ్లీ పిండి: పది ఇడ్లీలకు సరిపడేంత, కర్జూరాలు: 10, జీడిపప్పు: 20, కిస్మిస్ : 20, బాదంపప్పు: 10, చెర్రీస్: 6, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు, క్యారెట్ తురుము: అర కప్పు, తేనె: నాలుగు టేబుల్ స్పూన్లు

తయారీ
డ్రై ఫ్రూట్స్ ని చిన్న ముక్కలుగా చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి ఓ మాదిరి మంట మీద ఉడికించాలి.సగం ఉడికిన తర్వాత ఇడ్లీలపై డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి మూత పెట్టాలి. బాగా ఉడికిన ఇడ్లీలను ప్లేట్లలోకి తీసుకొని పైన కొద్దికొద్దిగా నెయ్యి వేసి దాని మీద క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, తేనె వేసి, చెర్రీస్తో గార్నిష్ చేస్తే చాలు.

Also Read: వెయ్యేళ్ల ఆలయం.. ఎదురెదురుగా శివ కేశవుల విగ్రహాలు ఇక్కడ విశేషం