ఇంట్లోకి దోమల్ని రానీయవు

ఇంట్లోకి దోమల్ని రానీయవు

లిక్విడ్​ వేపరైజర్​, మస్కిటో కాయిల్స్​కు బదులు కొన్నిరకాల మొక్కల్ని పెంచుకుంటే ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. మస్కిటో రెపెల్లెంట్స్​గా పనిచేసే కొన్ని మొక్కలు ఇవి.. 

లెమన్​ గ్రాస్

ఇంట్లో లెమన్​ గ్రాస్​ మొక్క ఉంటే దోమలు రావు.  తలుపు దగ్గర ఈ మొక్కల కుండీలు పెడితే దోమలు దూరంగా పోతాయి. 

సిట్రోనెల్లా ఒడొమస్

ఈ మొక్క వాసన నిమ్మజాతి మొక్కల ఆకుల వాసనని పోలి ఉంటుంది. సిట్రోనెల్లా ఒడొమస్​ని మస్కిటో రెపెల్లెంట్​ క్రీమ్స్​ తయారీలో వాడ తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే దోమలు  రావు.

కాట్నిప్

కాట్నిప్​ మొక్క ఆకుల్లో నెపటలాక్టోన్​ అనే రసాయనం ఉంటుంది. ఇది ఇన్​సెక్ట్​ రెపెల్లెంట్​గా పనిచేస్తుంది. కాట్నిప్​ ఆయిల్ రుద్దుకుంటే దోమలు కుట్టకుండా చూసుకోవచ్చు. 

జెరనియోల్​ 

ఇది సహజ రసాయనం. తేమని పీల్చుకుని, ఇంటి పరిసరాల్లో  దోమలు పెరగకుండా చేస్తుంది.

తులసి

తులసి మొక్క హెర్బల్​ టీగానే కాదు దోమల్ని తరిమేయడంలోనూ ఉపయోగపడుతుంది. పెరట్లో ఈ మొక్క ఉంటే, దీని ఘాటు వాసనకి దోమలు దరిదాపుల్లోకి కూడా రావు.  

దాల్చిన చెక్క నూనె 

ఈ నూనె చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. దోమలు పెరిగే చోట దాల్చిన చెక్క నూనె చల్లితే, దోమల లార్వాలు చనిపోతాయి.

లెమన్ యూకలిప్టస్​ అయిల్

ఈ నూనెని యూకలిప్టస్​ సిట్రియోడోరా  చెట్ల ఆకుల నుంచి తయారుచేస్తారు. ఇందులోని పారామెంథనే, డయోల్​ (పిఎండి) ఇన్​సెక్ట్​ రెపెల్లెంట్​గా పనిచేస్తుంది. చర్మానికి ఈ నూనె రుద్దుకుంటే దోమలతో పాటు ఇతర క్రిములు కూడా కుట్టవు. 

రోజ్​మేరీ

రోజ్​మేరీ మొక్క ఆకుల్ని కొన్ని రకాల వంటల్లో వాడతారు. రోజ్​మేరీని ఇంట్లో లేదా ఇంటి బయట పెంచితే దోమల బెడద తప్పుతుంది.