సీసీఎస్ నిధులు వాడేసిన ఆర్టీసీ యాజమాన్యం

 సీసీఎస్ నిధులు వాడేసిన ఆర్టీసీ యాజమాన్యం

రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొర జీతాలతో అవస్థలు పడుతున్నారు. CCS ఎమౌంట్  కూడా  ఇవ్వకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. క్రెడిట్ కోపరేటీవ్ సొసైటి లోన్లు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు ఉపయోగ పడ్తాయని ఆశపడిన ఆర్టీసీ ఉద్యోగులు.. ఆఫీసుచుట్టు చెప్పులరిగేలా తిరిగాల్సివస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


  
ఆర్టీసీ.. ఒకప్పుడు ఎన్నోఅవార్డులను సొంతం చేసుకుంది. సహకారపరపతి సంస్థగా ఉన్న సిసిఎస్ ఎంతోమందికి వివిధ రకాల లోన్స్ తో కార్మికుల కష్టాలను తీర్చేది. ప్రస్తుతం సీన్ రివర్స్  అయ్యింది. కొన్నేళ్లుగా  సిసిఎస్ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవడంతో సంస్థ దివాలా తీసేలా ప్రభుత్వం మార్చేసింది. క్రెడిట్ కోఆపరేటీవ్ సొసైటీలో ప్రస్తుతం చిల్లిగవ్వ లేకపోవడంతో.. ఆర్టీసీ కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల నెలనెలా జీతాలనుంచి 7.5శాతం కట్ చేసుకున్న అమౌంట్ ని ఆర్టీసీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వచ్చేవడ్డీ అమౌంట్ ని..సీసీఎస్ నుంచి లోన్స్ పొందేవారు. కానీ పిల్లల చదువులకు, పెళ్లిలతో పాటు కుటుంబ అవసరాలకు అర్జీపెట్టుకున్నాఇచ్చేవారే కరువయ్యారు. దీంతో..ఓ వైపు జీతం సరిపోక, PF డబ్బులు తీసుకొనే వీలులేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సిసిఎస్ లో మొత్తం 18వేలమందికి సభ్యత్వం ఉంది. ప్రస్తుతం వీరంతా తమకు సిసిఎస్ కటింగ్ ఆపేయాలని అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. మరోవైపు అమౌంట్ ఫిక్స్ డ్ చేసుకున్నవారికి కూడా చుక్కలు చూపిస్తోంది యాజమాన్యం. వాస్తవానికి ఎంప్లాయిస్ బేసిక్ లో కేవలం ఒక్కశాతమే కట్ చేయాలన్ననిబంధనలను పక్కనబెట్టి, 7శాతం కట్ చేస్తోంది. దీంతో అనుమతిలేకుండా తీసుకున్న1200 కోట్ల రూపాయలు ఎమయ్యాయో అర్ధంగాని పరిస్థితి ఏర్పడింది.

రిటైర్ట్ అయిన 10 వేలమంది డిపాజిట్లతో పాటు, 200 కోట్లు ఇప్పటికే సిసిఎస్ లోనే జమచేసివున్నాయి. దీంతో అవసరాలకు తీసుకోవచ్చనే ఉద్దేశంతో దాచుకున్న అమౌంట్ ఇప్పించడంలో.. ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. అరకొర జీతాలకు తోడూ బెనిఫిట్స్ కూడా ఆందోళలను చేస్తేగాని రాని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఒకట్రెండు డీఏలు ఇచ్చినా పీఆర్సీతో పాటు, ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయంగా రావాల్సినవి కూడా ఎన్నికలవరకు ఆపీ ఇవ్వడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి యూనియన్స్.  ఎన్నికల తర్వాత ఇస్తామన్న పీఆర్సీతో పాటు లోన్స్, యూనియన్లను యథావిధిగా కొనసాగించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.