మీ దుంప తెగ.. ఇలా తయారయ్యారేంట్రా: లడ్డూ వేలం డబ్బులు కట్టేందుకు మేకల దొంగతనం

మీ దుంప తెగ.. ఇలా తయారయ్యారేంట్రా: లడ్డూ వేలం డబ్బులు కట్టేందుకు మేకల దొంగతనం

చేవెళ్ల, వెలుగు: గతేడాది గణేశ్​లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న వ్యక్తులు ఆ డబ్బులు కట్టడం కోసం మేకల చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన రావులపల్లి సుభాన్‎కు చెందిన రెండు మేకలు సోమవారం అర్ధరాత్రి చోరీకి గురయ్యాయి. వికారాబాద్​జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్​ గ్రామానికి చెందిన విష్ణువర్దన్, అశోక్, ప్రకాశ్​ఈ చోరీకి పాల్పడ్డారు. 

మంగళవారం అశోక్​ లీలాండ్​వాహనంలో వాటిని తీసుకెళ్తుండగా మొయినాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా గతాడాది వేలంలో గణేశ్​లడ్డూను దక్కించుకోగా, ఆ డబ్బులు కట్టడం కోసం మేకలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులతో పాటు అశోక్​ లీలాండ్​ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేకలకు బాధిత రైతు సుభాన్​కు అప్పగించినట్లు చేవెళ్ల సీఐ భూపాల్​ శ్రీధర్​ తెలిపారు.