కేసీఆర్ పతనం మొదలయిందని వారికి అర్థమైంది : వైఎస్ షర్మిల

కేసీఆర్ పతనం మొదలయిందని వారికి అర్థమైంది : వైఎస్ షర్మిల

నర్సంపేట ఘటనపై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల గవర్నర్ తమిళిసైకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఆమె కంప్లైంట్ చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకపోయినా తనను అరెస్టు చేశారని ఈ సందర్భంగా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాజ్ భవన్ నుంచి బయటికొచ్చిన వైఎస్ షర్మిల.. అధికార పార్టీపై మండిపడ్డారు. కేసీఆర్ పతనం మొదలయిందని వారికి అర్థమైందని చెప్పారు. కావాలనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. 

కేసీఆర్ గూండాలే తమ వాహనాలు ధ్వంసం చేశారని వైఎస్ షర్మిల చెప్పారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ భరించలేకపోతున్నారన్నారు. కేసీఆర్ ఇళ్లపైన రైడ్ చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ లో కేంద్ర సంస్థలు సోదాలు చేయాలన్నారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు తమను బెదిరించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దాంతో పాటు తనపై దాడి చేసినందుకు కేంద్ర హోంశాఖకు, సుప్రీంకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.