నల్గొండ మోత్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో చేతివాటం చూపించాడు ఓ దొంగ. సందట్లో సడేమియా అన్నట్లు.. స్థానిక నేతలు మంత్రుల స్వాగత బిజీలో ఉంటే.. దొంగ మాత్రం ఏం చక్కా జేబుల్లో చేతులు పెట్టి చోరీ చేశాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి జోబులో నుంచి 40 వేలు.. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ జోబులో నుంచి 37 వేలు.. మోత్కూర్ ZPTC భర్త సంతోష్ రెడ్డి జోబులో నుంచి 40 వేలు దొంగిలించినట్లు చెప్పారు నేతలు. డబ్బులు చోరీ చేస్తున్న సీన్ వీడియో రికార్డు అయింది. ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామంటున్నారు బాధిత నేతలు.
