14 మంది డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీ..వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశం

14 మంది డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీ..వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా కారణాలతో14 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ), డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి ఎస్‌‌‌‌‌‌‌‌డీసీగా పనిచేస్తున్న బి. జయశ్రీని రాజన్న సిరిసిల్ల జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా నియమించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కె. అనంత రెడ్డిని రంగారెడ్డి జిల్లా డీఆర్వోగా బదిలీ చేశారు.ప్రమోషన్ పొందిన ఎం. దేవదాస్‌‌‌‌‌‌‌‌ను నిర్మల్ ఆర్డీవోగా, డి. శ్రీధర్ బాబును సిరిసిల్ల ఆర్డీవోగా నియమించారు.

మహబూబాబాద్ ఆర్డీవో కాసుల కృష్ణవేణిని ములుగు ఆర్డీవోగా, ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ ఎం. రాజేశ్వరిని మహబూబాబాద్ ఆర్డీవోగా బదిలీ చేశారు.రంగారెడ్డి ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ వై. శ్రీనివాస్ రెడ్డిని ఇబ్రహీంపట్నం ఆర్డీవోగా, పదోన్నతి పొందిన కె.సి. ప్రమీలను యాదాద్రి భువనగిరి ఎస్‌‌‌‌‌‌‌‌డీసీగా నియమించారు. వెయిటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కె. నారాయణను హైదరాబాద్ డీఆర్వోగా, లా ఆఫీసర్ డి. శ్రీధర్‌‌‌‌‌‌‌‌ను రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ చేశారు.

రాజేంద్రనగర్ ఆర్డీవోగా ఉన్న కొప్పుల వెంకట్ రెడ్డికి పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా పదోన్నతి కల్పించారు.హన్మకొండకు చెందిన తహసీల్దార్ జి. సదానందంను ఖమ్మం ఐపీటీ అండ్ రైల్వే ఎస్‌‌‌‌‌‌‌‌డీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీల్లో ఇటీవల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌కు గురై, ప్రస్తుతం తిరిగి విధుల్లోకి చేరిన (రీఇన్‌‌‌‌‌‌‌‌స్టాట్‌‌‌‌‌‌‌‌మెంట్ పొందిన) ఎం. షర్మిలను కరీంనగర్ ఆర్డీవోగా నియమించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.